అనీల్.. మహేష్.. మరో సినిమా..!

October 18, 2019


img

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు, అనీల్ సుంకర ఈ సినిమా నిర్మిస్తున్నారు. 2020 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అవుతుంది. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ టైంలో అనీల్ రావిపుడి పర్ఫెక్షన్ చూసి మహేష్ కు బాగా నచ్చేసిందట. 

పటాస్ నుండి ఎఫ్-2 వరకు అనీల్ రావిపుడి వరుస హిట్లు అందుకుంటున్నాడు. సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా పక్కా హిట్ అనేస్తున్నారు. అందుకే అనీల్ రావిపుడితో మహేష్ మరో సినిమా లైన్ లో పెడుతున్నాడట. సరిలేరు నీకెవ్వరు షూటింగ్ లోనే అనీల్ కు మరో సినిమా చేస్తానని మాట ఇచ్చాడట మహేష్. సరిలేరు నీకెవ్వరు సూపర్ హిట్ అయితే కనుక మళ్లీ మహేష్, అనీల్ రావిపుడి సినిమా కన్ ఫాం అయినట్టే లెక్క. రాజమౌళి సినిమా ముందు ఈ గ్యాప్ లో రెండు సినిమాలు పూర్తి చేయాలని చూస్తున్నాడు మహేష్. అందులో త్రివిక్రం ఓ సినిమా ఉంటుందని టాక్. Related Post

సినిమా స‌మీక్ష