చిరు 152.. త్రిష కన్ఫామ్.. !

October 18, 2019


img

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో వస్తున్న సినిమా ఈమధ్య ముహూర్త కార్యక్రమాలు జరుపుకుంది. డిసెంబర్ నుండి ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి కలిసి నిర్మిస్తున్న ఈ మూవీలో హీరోయిన్ ఫైనల్ అయినట్టు తెలుస్తుంది. అనుష్క, త్రిషలలో ఒకరు కన్ఫామ్ అవుతారని టాక్. లేటెస్ట్ టాక్ ప్రకారం ఈ మూవీలో హీరోయిన్ గా త్రిష ఆల్మోస్ట్ కన్ ఫామ్ అట


సైరా సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న చిరంజీవి కొరటాల శివతో కూడా హిట్ కొట్టేలా ఉన్నాడు. మిర్చి నుండి భరత్ అనే నేను వరకు వరుస హిట్లు కొడుతున్న కొరటాల శివ చిరుతో ఎలాంటి మూవీ చేస్తాడో చూడాలి. ఈ మూవీలో చిరుతో పాటుగా చరణ్ కూడా నటిస్తున్నాడని తెలుస్తుంది. సో ఈ సినిమా మెగా ఫాన్స్ కు డబల్ ధమాకా అని చెప్పొచ్చు.


Related Post

సినిమా స‌మీక్ష