విజయ్ 'విజిల్' ట్రైలర్.. హిట్టు పక్కా..!

October 18, 2019


img

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ అట్లీ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ బిగిల్. తెరి, మెర్సల్ సక్సెస్ లతో ఈ కాంబినేషన్ లో మూవీ అంటే పక్కా హిట్ అన్న అంచనాలు ఏర్పడ్డాయి. బిగిల్ ట్రైలర్ రిలీజై యూట్యూబ్ ను షేక్ చేస్తుంది. అయితే తన ప్రతి సినిమాను తెలుగులో రిలీజ్ చేసే విజయ్ బిగిల్ ను కూడా తెలుగులో విజిల్ గా రిలీజ్ చేస్తున్నారు. మహేష్ కోనేరు తెలుగులో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు.

తెలుగు వర్షన్ ట్రైలర్ గురువారం సాయంత్రం రిలీజ్ చేశారు. విజిల్ టైటిల్ కు తగినట్టుగానే విజిల్ కొట్టేలా సినిమా వచ్చింది. ట్రైలర్ చూస్తే విజయ్ ఫ్యాన్స్ కు దీవాళికి డబుల్ ధమాకా ఇచ్చేలా ఉంది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో విజయ్ 3 డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించింది. మరి విజిల్ ట్రైలర్ అదరగొట్టినగా సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందో లేదో చూడాలి.

Related Post

సినిమా స‌మీక్ష