రిలీజ్ డేట్ లాకైంది.. పోటీ రసవత్తరమే..!

October 17, 2019


img

నందమూరి కళ్యాణ్ రామ్ సంక్రాంతి రేసులో దిగేందుకు రెడీ అవుతున్నాడు. సతీష్ వేగేశ్న డైరక్షన్ లో కళ్యాణ్ రామ్ నటిస్తున్న సినిమా ఎంత మంచివాడవురా. మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఆదిత్య మ్యూజిక్ వారు నిర్మిస్తున్నారు. 2020 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. అయితే ఇప్పటికే జనవరి 12న పొంగల్ వార్ కు మహేష్, అల్లు అర్జున్ సిద్ధమయ్యారు. మహేష్ సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాలు ఒకేరోజు రిలీజ్ అవుతున్నాయి.     

ఇక జనవరి 10న సూపర్ స్టార్ రజినికాంత్ దర్బార్ కూడా వస్తుంది. అయితే కళ్యాణ్ రాం సినిమా జనవరి 15న రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. సతీష్ వేగేశ్న డైరెక్ట్ చేసిన శతమానం భవతి సినిమా సంక్రాంతికి వచ్చి సూపర్ హిట్ అందుకుంది. అదే సెంటిమెంట్ తో మళ్లీ సంక్రాంతికి వచ్చి హిట్టు కొట్టే ఆలోచనలో ఉన్నాడు దర్శకుడు. ఈమధ్య వచ్చిన టీజర్ కూడా మెప్పించగా సినిమా సంక్రాంతికి వస్తున్న సినిమాలకు ఎంత పోటీ ఇస్తుందో చూడాలి. 



Related Post

సినిమా స‌మీక్ష