విడిపోతున్న మంచు మనోజ్ దంపతులు

October 17, 2019


img

మంచు ఫ్యామిలీ హీరో మంచు మనోజ్ కొన్నాళ్లుగా పర్సనల్ గా ప్రొఫెషనల్ గా డిస్ట్రబెన్స్ లో ఉన్నాడని అందరికి తెలిసిందే. అందుకే సినిమాలు చేయకుండా ఫ్యాన్స్ కు దూరంగా ఉన్నాడు. అయితే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ వచ్చాడు. కొన్నాళ్లుగా తన లైఫ్ లో జరుగుతున్న విషయాల పట్ల ఎవరికి ఏమి చెప్పని మంచు మనోజ్ ఫైనల్ గా ఈరోజు ఓ పెద్ద మెసేజ్ తో అన్ని విషయాలు చెప్పాడు.

తన భార్యతో విడాకులకు సిద్ధమవుతున్నట్టు అఫిషియల్ గా ప్రకటించారు మంచు మనోజ్. అంతేకాదు ఇక మీదట తను వరుస సినిమాలు చేస్తానని.. తనకు తోడుగా ఉన్న ఫ్యాన్స్ కు కృతజ్ఞతలని తెలిపాడు మంచు మనోజ్. రెండేళ్ల నుండే మనోజ్ తన భార్య విడి విడిగా ఉంటున్నారన్న వార్తలు వచ్చాయి. ఇన్నాళ్లకు మంచు మనోజ్ తన డైవర్స్ గురించి అఫిషియల్ గా చెప్పాడు. కలిసి ఉండి బాధపడటం కన్నా విడిపోయి ఎవరికి వారు సుఖంగా ఉండటం మంచిదని భావించారు కావొచ్చు. అందుకే మంచు మనోజ్ విడాకులకు సిద్ధమయ్యాడు. మరి అసలు వారిద్దరి మధ్య గొడవలకు కారణాలేంటి..? ఎందుకు విడిపోవాలని అనుకున్నారు అన్న విషయాలు బయటకు రాలేదు. 



 


Related Post

సినిమా స‌మీక్ష