రాజు గారి గదిలో వెంకటేష్.. కాని..!

October 17, 2019


img

ఓంకార్ డైరక్షన్ లో తెరకెక్కిన రాజు గారి గది 3 సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో అవికా గోర్, అశ్విన్ నటించారు. రాజు గారి గది సినిమా సూపర్ హిట్ కాగా ఆ తర్వాత వచ్చిన రాజు గారి గది 2 సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. నాగార్జున, సమంతలు కలిసి నటించిన రాజు గారి గది 2 ప్రేక్షకులను మెప్పించలేదు. అయితే రాజు గారి గది 3 మాత్రం తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని అంటున్నారు డైరక్టర్ ఓంకార్.

అయితే రాజు గారి గది 2లో అసలైతే వెంకటేష్ ను తీసుకోవాలని అనుకున్నాం కాని ఆయన డేట్స్ అడ్జెస్ట్ అవ్వక నాగార్జున గారు చేశారు. అయితే రాజు గారి గది 10 పార్టులు తీస్తానని చెబుతున్న ఓంకార్ ఏదో ఒక పార్ట్ మాత్రం కచ్చితంగా వెంకటేష్ తో తీస్తానని చెబుతున్నాడు. వెంకటేష్ కు కూడా ఇలాంటి సినిమాల మీద ఇంట్రెస్ట్ ఎక్కువే ఉంటుంది. ఎప్పటిదాకో ఎందుకు రాజు గారి గది 3 హిట్టైతే వెంకటేష్ పిలిచి ఛాన్స్ ఇచ్చినా ఇవ్వొచ్చు.     



Related Post

సినిమా స‌మీక్ష