బిగ్ బాస్ విన్నర్ అతనేనా

October 16, 2019


img

బిగ్ బాస్ సీజన్ 3విన్నర్ ఎవరు..  ఈ ప్రశ్నకు మరో రెండు వారల్లో ఆన్సర్ దొరుకుతుంది. మొదటి సీజన్లో టైటిల్ విన్నర్ ఎవరన్నది చివరివరకు ఊహించలేదు. అయితే సెకండ్ సీజన్ పరిస్థితి మారింది. చివరి మూడు వారాల ముందే విన్నర్ కౌశలే అని ఫిక్స్ అయ్యారు. 

ఈ సీజన్ లో కూడా టైటిల్ విన్నర్ ఎవరన్నది చెప్పడం కష్టమే అనేలా ఉన్నా కొందరు మాత్రం విన్నర్ డిసైడ్ అయ్యాడని అంటున్నారు. ఇంతకీ ఎవరా విజేత అంటే రాహుల్ సిప్లిగంజ్ అని అంటున్నారు. సింగర్ గానే కాదు అతను కుల వృత్తి చేయడంలో కూడా ఎలాంటి మొహమాటం లేకుండా ఇంటి సభ్యులకు కటింగ్ చేయడం లాంటివి ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. అందుకే ఈసారి విన్నర్ రాహులే అని టాక్ వినిపిస్తుంది. మరి విన్నర్ ఎవరన్నది తెలియాలంటే మరో  మూడు వారాలు ఆగితే తెలుస్తుంది.


Related Post

సినిమా స‌మీక్ష