సూపర్ హిట్ రీమేక్ తో కృష్ణ వంశీ

October 16, 2019


img

ఒకప్పుడు క్రియేటివ్ డైరెక్టర్ సెన్సేషనల్ సినిమాలు తీసిన కృష్ణవంశీ ఇప్పుడు కెరియర్ లో పూర్తిగా వెనుకబడి పోయాడు. కొత్త కొత్త టాలెంటెడ్ గయ్స్ ఇండస్ట్రీకి పరిచయం అవుతుండగా పాత దర్శకులు వారితో పోటీ పడడంలో వెనుకపడుతున్నారు. కృష్ణ వంశీ విషయానికి వస్తే నక్షత్రం సినిమా డిసాస్టర్ తర్వాత మళ్ళీ ఆయనతో సినిమా తీసే సహాసం ఎవరు చేయలేదు. 

అయితే గ్యాప్ తీసుకున్నా ఒక క్రేజీ ప్రాజెక్ట్ తో సర్ ప్రైజ్ చేస్తున్నాడు కృష్ణ వంశీ. ఇంతకీ ఆయన చేస్తున్న సినిమా ఏంటి అంటే రంగమార్తాండ . మరాఠీలో సూపర్ హిట్ అయిన నట సామ్రాట్ మూవీకి రీమేక్ గా ఈ సినిమా వస్తుంది. నానా పటేకర్ నటించిన ఈ మూవీలో అతని నటన ఎంతగానో మెప్పించింది. నానా పటేకర్ పాత్రలో ప్రకాష్ రాజ్ నటిస్తున్నాడట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీ అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ త్వరలో రానుంది.


Related Post

సినిమా స‌మీక్ష