విజయ్ విజిల్ మూడు గంటలా.. !

October 16, 2019


img

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ అట్లీ డైరెక్షన్ లో చేస్తున్న సినిమా బిగిల్. తెలుగులో ఈ మూవీని విజిల్ గా రిలీజ్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత మహేష్ కోనేరు బిగిల్ తెలుగు వర్షన్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ రీసెంట్ గా రిలీజై యూట్యూబ్ ను షేక్ చేసింది. దీవాళీ కానుకగా ఈ నెల 27న రిలీజ్ అవుతున్న బిగిల్ సినిమా రన్ టైం ఎంతో బయటకు వచ్చింది. 

ఈమధ్య కంటెంట్ ఎక్కడ కట్ చేయాలో తెలియక స్టార్ సినిమా లు అన్ని అటు ఇటుగా 3గంటలు తీస్తున్నారు.  బిగిల్ కూడా 2 గంటల 59 నిమిషాలు వచ్చిందట. అంటే నిమిషం తక్కువ 3 గంటలు అన్నమాట. తమిళంలో ఓకే కాని తెలుగు ప్రేక్షకులు అంత రన్ టైం చూడగలరా అన్నది డౌట్ గా మారింది. విజయ్ తన ప్రతి సినిమా తెలుగులో రిలీజ్ చేస్తాడు కాని ఆశించిన స్థాయిలో మాత్రం ఫలితాలు అందుకోలేదు. మరి బిగిల్ అదే విజిల్ అయినా హిట్టు కొడుతుందో లేదో చూడాలి. 


Related Post

సినిమా స‌మీక్ష