మల్టీస్టారర్ గా మహా సముద్రం

October 16, 2019


img

ఆరెక్స్ 100తో హిట్ అందుకున్న అజయ్ భూపతి మొదటి సినిమాతోనే తన సత్తా చాటాడు. కార్తికేయ, పాయల్ రాజ్ ఫుత్ లీడ్ రోల్ లో నటించిన ఈ మూవీ వారిద్దరికీ మంచి క్రేజ్ తెచ్చింది. ప్రస్తుతం కార్తికేయ,  పాయల్ రాజ్ పుత్ ఇద్దరు వరుస అవకాశాలు అందుకుంటుంది. 

డైరెక్టర్ అజయ్ భూపతి తన సెకండ్ సినిమా కోసం రకరకాల  ప్రయత్నాలు చేస్తున్నాడు. రామ్, నితిన్ లతో పాటుగా నాగ చైతన్య కూడా ఓకే అన్నట్టే అని మళ్ళీ వెనక్కి తగ్గారు. మాస్ మహారాజ్ రవితేజ సినిమా కన్ ఫామ్ చేసినట్టే చేసి చివరకు హ్యాండ్ ఇచ్చాడు. 

ఫైనల్ గా తనకు స్టార్స్ వర్క్ అవుట్ అవట్లేదని మళ్ళీ యువ హీరోలతో ఈ మూవీ చేస్తాడట. ఈ సినిమాకు మహా సముద్రం అని టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ మూవీలో కార్తికేయ,  విశ్వక్ సేన్ నటిస్తారని తెలుస్తుంది. మరి ఇద్దరు యువ హీరోలు చేస్తున్న ఈ మూవీ ఎలా ఉంటుందో చూడాలి.


Related Post

సినిమా స‌మీక్ష