కొరటాల శివ, చిరు.. కథ లీక్..!

October 15, 2019


img

మిర్చి నుండి భరత్ అనే నేను వరకు స్టార్ సినిమాల్లోనే ఓ కొత్త పాయింట్ చెబుతున్న దర్శకుడు కొరటాల శివ. రైటర్ గా తనకు ఉన్న అనుభవం కూడా తోడై దర్శకుడిగా తాను చెప్పదలచుకున్న పాయింట్ ను పర్ఫెక్ట్ గా చెప్పేస్తున్నాడు. అందుకే వరుస హిట్లు కొడుతున్నాడు. మహేష్ భరత్ అనే నేను తర్వాత కొద్దిపాటి గ్యాప్ తీసుకున్న కొరటాల శివ రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవితో సినిమా షురూ చేశాడు.

త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ సినిమా కథ ఇదే అంటూ ఓ లైన్ ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతుంది. ఈ సినిమా దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబందించిన కథ అని తెలుస్తుంది. ఆ శాఖలో జరిగే అవినీతిని బయట పెట్టే కథతో ఈ సినిమా వస్తుందట. రాజకీయ నాయకులు ఎలా దేవాలయ భూములను దోచుకుంటారో ఈ సినిమాలో ప్రస్థావిస్తారట. మరి కొరటాల శివ కాబట్టి ఎవరిని నొప్పించకుండానే చెప్పాల్సిన మ్యాటర్ చెప్పేస్తాడు. మొత్తానికి కోలీవుడ్ లో ఒకప్పుడు శంకర్ ఇప్పుడు అట్లీలా టాలీవుడ్ లో కొరటాల శివ కూడా సమాజానికి ఉపయోగపడే సినిమాలు చేస్తున్నాడు.  Related Post

సినిమా స‌మీక్ష