కార్తి 'ఖైది' ట్రైలర్.. విధ్వంసమే..!

October 15, 2019


img

తమిళ హీరోనే అయినా తెలుగులో కూడా క్రేజ్ తెచ్చుకున్న హీరోల్లో కార్తి ఒకరు. అన్న సూర్య తర్వాత అతని తమ్ముడు కార్తి కూడా తెలుగు ఆడియెన్స్ కు నచ్చేశాడు. పక్కింటి కుర్రాడి ఇమేజ్ తో తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తున్న కార్తి తను ఏ సినిమా చేసినా సరే తమిళంతో పాటుగా తెలుగులో కూడా రిలీజ్ చేస్తాడు. లేటెస్ట్ గా కార్తి హీరోగా వస్తున్న సినిమా ఖైది. లోకేష్ కనకరాజ్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది.

ఇక ట్రైలర్ విషయానికొస్తే.. జీవిత ఖైది అయిన ఢిల్లీ అదే మన కార్తి.. వందల కోట్ల విలువ చేసే డ్రగ్స్ ట్రాన్స్ పోర్ట్ అవుతుండగా పోలీసులు పట్టుకుంటారు. అయితే వారి దగ్గర నుండి ఓ దొంగల ముఠా దాన్ని కాజేస్తారు. ఆ దొంగల ముఠాని పట్టుకునేందుకు ఢిల్లీ సహాయం తీసుకుంటారు పోలీసులు. కథ ఎలా ఉన్నా కార్తి మాస్ లుక్ అదిరిపోయింది. కార్తి నటించిన ఖాకీ సినిమాకు ఈ సినిమాకు కాస్త దగ్గర పోలీకలు ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే అందులో కార్తి పోలీస్ కాగా.. ఇందులో ఖైదిగా నటిస్తున్నాడు. ట్రైలర్ ఇంప్రెస్ చేసింది. అయితే పాటలు, హీరోయిన్ లేని ఈ దీవాళికి రిలీజ్ అవుతుంది. మరి ఆడియెన్స్ ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.  





Related Post

సినిమా స‌మీక్ష