రాముడు కూడా మంచోడే.. కానీ.. !

October 09, 2019


img

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా సతీష్ వేగేశ్న డైరెక్షన్ లో వస్తున్న సినిమా ఎంత మంచివాడవురా. ఆదిత్య మ్యూజిక్ వారు నిర్మిస్తున్న ఈ మూవీలో కళ్యాణ్ రామ్ సరసన మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు సంబందించిన టీజర్ దసరా కానుకగా రిలీజ్ చేశారు. 

ఈ టీజర్ లో కళ్యాణ్ రామ్ ను అందరు రకరకాల పేర్లతో ప్రస్తావిస్తూ మంచోడని అంటారు. అందరు మంచోడని అంటుంటే నువ్విలా కొడతావే అని ఒకడు అడిగితే మాత్రం రాముడు కూడా మంచోడే రా కాని రావణాసురుడిని ఏసేయ్యలా.. అని కళ్యాణ్ రామ్ పవర్ ఫుల్ డైలాగ్ కొడతాడు. సినిమా టీజర్ మెప్పించగా సినిమా ఎలా ఉంటుందో చూడాలి.  2020 సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.Related Post

సినిమా స‌మీక్ష