దసరా లుక్స్ అదిరిపోయాయ్..!

October 09, 2019


img

పండుగ వస్తే చాలు సెట్స్ మీద ఉన్న సినిమాల సందడి మాములుగా ఉండదు. స్టార్ హీరోలు తమ ఫాన్స్ కు స్పెషల్ గిఫ్ట్స్ ఇస్తారు. దసరా సందర్బంగా స్టార్ హీరోల సినిమా పోస్టర్స్ అలారించాయి. సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు నుండి క్రేజీ పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. కొండారెడ్డి బురుజు ముందు గొడ్డలి పట్టుకొని నిలుచున్న మహేష్ పోస్టర్ ఫాన్స్ కి సర్ ప్రైజ్ చేసింది. 


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న అల వైకుంఠపురములో సినిమా నుండి ఒక పోస్టర్ వదిలారు. బన్నీ ఫైట్ చేస్తున్న స్టిల్ తో ఈ పోస్టర్ వచ్చింది. ఈ దసరాకి బాలయ్య బాబు 105 వ సినిమా పోస్టర్ కూడా వచ్చింది.  క్లాస్ లుక్ తో కనిపించినా చేతిలో కత్తి పట్టుకుని బాలకృష్ణ లుక్ అదిరింది. 


వీటితో పాటుగా వెంకటేష్,  నాగ చైతన్య కలిసి చేస్తున్న వెంకీమామ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ కూడా దసరా రోజున రిలీజ్ చేశారు. డైరెక్టర్ వినాయక్ హీరోగా చేస్తున్న సీనయ్య పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.  మొత్తానికి దసరా పండుగ రోజు కొత్త సినిమాల పోస్టర్స్ తో పండుగ మరింత కలర్ ఫుల్ చేశారు.


Related Post

సినిమా స‌మీక్ష