సుడిగాలి సుధీర్ లవ్ ఫెయిల్యూర్

October 07, 2019


img

స్మాల్ స్క్రీన్ పై తన ఎనర్జిటిక్ యాంకర్ తో.. కామెడీ టైమింగ్ తో అలరించే సుడిగాలి సుధీర్ కు మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఈ పాపులారిటీతోనే సాఫ్ట్ వేర్ సుధీర్ అనే సినిమా కూడా చేస్తున్నాడు. సుధీర్, రష్మిల జోడీ సూపర్ హిట్. షో ఏదైనా సరే రష్మి ప్రేమ కోసం సుధీర్ వెంటపడటం ఆమె కాదనడం చూస్తూనే ఉంటాం. అందుకే సుధీర్, రష్మిలలో ఎవరు కనిపించినా సరే మీ ఇద్దరి మధ్య ఏం నడుస్తుందని అడుగుతారు.    

వారికి కూడా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పి విసుగు వచ్చింది. అయితే ఈమధ్య మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధీర్ తనకు రష్మికు మధ్య ఎలాంటి రిలేషన్ లేదని మరోసారి క్లారిటీ ఇచ్చాడు. తనొక లవ్ ఫెయిల్యూర్ అని అందుకే ఇక మీదట ఆడవాళ్ల జోలికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నానని అన్నాడు సుధీర్. సుధీర్, రష్మిల మధ్య ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడాలంటే మాత్రం ఇద్దరిలో ఎవరో ఒకరు పెళ్లి చేసుకోవాల్సిందే. అప్పటికి కాని ఈ వార్తలు ఆగే అవకాశం ఉంది.Related Post

సినిమా స‌మీక్ష