RRR పూర్తి టైటిల్ ఇదేనా..!

October 07, 2019


img

రాజమౌళి డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో అలియా భట్, అజయ్ దేవగన్ కూడా నటిస్తున్నారు. 2020 జూలై 30న రిలీజ్ ఫిక్స్ చేసిన ఈ సినిమాకు తెలుగు టైటిల్ రివీల్ అయ్యింది. ఆర్.ఆర్.ఆర్ ప్రెస్ మీట్ లో ఆర్.ఆర్.ఆర్ అన్నది కామన్ టైటిలే అయినా ప్రతి భాషలో దానికో అబ్రివేషన్ ఉంటుందని చెప్పారు రాజమౌళి.

అనుకున్నట్టుగానే తెలుగులో ఆర్.ఆర్.ఆర్ కు రామ రౌద్ర రుషితం అని ఫైనల్ చేశారట ఇక మిగతా భాషల్లో రైజ్ రివోల్ట్ రివెంజ్ అని పెట్టబోతున్నారట. తను ఏం చేసినా పర్ఫెక్ట్ గా చేసే రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ సినిమాను కూడా బాహుబలి స్థాయిలో నిలిచేలా తెరకెక్కిస్తున్నారు. అక్టోబర్ 22న కొమరం భీం జయంతి సందర్భంగా ఆర్.ఆర్.ఆర్ ఎన్.టి.ఆర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. సినిమాలో కొమరం భీం గా తారక్, అల్లూరి సీతారామరాజుగా రాం చరణ్ నటిస్తున్నారు. 



Related Post

సినిమా స‌మీక్ష