సోలో బ్రతుకే బెటర్ అనుకున్నాడు..!

October 07, 2019


img

మెగా మేనళ్లుడు సాయి తేజ్ హీరోగా నూతన దర్శకుడు సుబ్బు డైరక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా సోలో బ్రతుకే సో బెటర్. బోగవళ్లి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా ఈరోజు మొదలు పెట్టారు. ముహుర్తం రోజునే టైటిల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. వరుసగా ఆరు ఫ్లాపుల తర్వాత చిత్రలహరి సినిమాతో హిట్ అందుకున్న సాయి తేజ్ ప్రస్తుతం మారుతి డైరక్షన్ లో ప్రతిరోజు పండుగే సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా తర్వాత సాయి తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ సినిమా చేస్తున్నాడు. ప్రతిరోజు పండుగే సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తుంది. అయితే సోలో బ్రతుకే సో బెటర్ మాత్రం కొత్త కాన్సెప్ట్ తో వస్తుందట. సినిమా కథల విషయంలో తొందరపడకుండా సాయి తేజ్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడట. ఈ ఇయర్ మెగా హీరోలకు బాగా కలిసి వస్తుంది. సాయి తేజ్ మారుతి కాంబోలో వస్తున్న ప్రతిరోజు పండుగ మూవీ డిసెంబర్ లో రిలీజ్ చేస్తారని తెలుస్తుంది.Related Post

సినిమా స‌మీక్ష