పునర్నవి బయటకు వచ్చేసింది..!

October 07, 2019


img

బిగ్ బాస్ హౌజ్ సీజన్ 3 నుండి పునర్నవి భూపాలం బయటకు వచ్చేసింది. లాస్ట్ వీక్ నామినేషన్స్ లో మహేష్, వరుణ్, రాహుల్, పునర్నవి ఉండగా వీరిలో పునర్నవి ఆదివారం ఎలిమినేట్ అయ్యింది. అసలైతే మహేష్ బయటకు వచ్చేస్తాడని అందరు అనుకోగా పునర్నవి ఇంటి నుండి బయటకు వచ్చేసింది. పునర్నవి ఎలిమినేట్ అవడంతో హౌజ్ లో ఆమెతో క్లోజ్ గా ఉన్న రాహుల్ సిప్లిగంజ్ బాగా ఎమోషనల్ అయ్యాడు.

పునర్నవి కోసం చివరగా ఓ పాట పాడమని నాగార్జున చెప్పగా ఏమైపోయావే సాంగ్ పాడుతూ మధ్యలో కన్నీళ్లు పెట్టుకున్నాడు రాహుల్. తనకు ఇంట్లో చాలా క్లోజ్ అయిన పునర్నవి వెళ్లడం బాధించిందని అన్నాడు రాహుల్. మరో నాలుగు వారాలు మాత్రమే ఉన్న బిగ్ బాస్ సీజన్ 3లో ప్రస్తుతం 8 మంది కంటెస్టంట్స్ ఉన్నారు. మరి వీరిలో టాప్ 3కి ఎవరు చేరుకుంటారో చూడాలి. టైటిల్ రేసు దగ్గరపడుతున్నా కొద్ది బిగ్ బాస్ టాస్కులు కూడా టఫ్ గా ఉన్నాయి.Related Post

సినిమా స‌మీక్ష