నయనతార ఓ బ్యాడ్ సెంటిమెంట్..!

October 07, 2019


img

సౌత్ లో లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ నయనతార. కోలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలకు ధీటుగా ఆమె సినిమాలు ఆడతాయి. ఫీమేల్ లీడ్ సినిమాలకు నయనతార కొత్త క్రేజ్ తెచ్చింది. తమిళంలో నయనతార సినిమా చేస్తుంది అంటే అది సూపర్ హిట్ అన్నట్టే లెక్క అన్న రేంజ్ తెచ్చుకుంది. తమిళంలోనే కాదు తెలుగులో కూడా నయనతార సినిమాలు చేస్తుంది. మన సీనియర్ స్టార్స్ కు ఆమె పర్ఫెక్ట్ పెయిర్ అనిపించుకుంది.

రీసెంట్ గా సైరా సినిమాలో కూడా నయనతార నటించి మెప్పించింది. సినిమాలైతే చేస్తుంది కాని ప్రమోషన్స్ కు మాత్రం ఆమె దూరంగా ఉంటుంది. తెలుగు సినిమాలే కాదు తమిళ సినిమాల ప్రమోషన్స్ కు ఆమె అటెండ్ అవదు. 10 ఏళ్ల తర్వాత నయనతార వోగ్ మేగజైన్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. అయితే ఇంటర్వ్యూలో భాగంగా నయనతార సినిమా ప్రమోషన్స్ పాల్గొనకపోవడం గురించి కూడా ప్రస్థావించింది. తను చేసిన సినిమాల ప్రమోషన్స్ లో తను పాల్గొంటే ఆ సినిమాలు ఫెయిల్ అవుతాయన్న సెంటిమెంట్ ఉందట. అందుకే నయనతార తన సినిమాలను ప్రమోట్ చేయనని చెప్పుకొచ్చింది. సెంటిమెంట్స్ ఉండాలి కాని ఇలా కేవలం తను ప్రమోషన్స్ కు వస్తేనే సినిమా ఫ్లాప్ అవుతుందని చెప్పడం మాత్రం కరెక్ట్ కాదు. మరి ఇకమీదట అయినా నయనతార ప్రమోషన్స్ లో పాల్గొంటుందో లేదో చూడాలి.    Related Post

సినిమా స‌మీక్ష