ఈ మొక్కుబడి వీడియోలు ఎందుకు రాజా..!

October 05, 2019


img

కొన్ని సినిమాల మీద తప్పక మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వృత్తి ధర్మంగా మాట్లాడాలని మాట్లాడే వారు కొందరు ఉంటారు. సేమ్ టూ సేమ్ అలానే సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టుకుని రిలీజైన ప్రతి సినిమా గురించి తన ఆలోచనా విధానంగా విశ్లేషించే దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ లేటెస్ట్ గా రిలీజైన సైరా సినిమా గురించి సెటైరికల్ వీడియో వేశాడని చెప్పొచ్చు.  

యావరేజ్ టాక్ తెచ్చుకున్న సాహో సినిమానే 300 కోట్లు వసూళు చేసింది కాబట్టి సైరా సినిమా కచ్చితంగా 300, 500, 1000 కోట్లు వసూళు చేస్తుందని అన్నారు. అవసరమైతే 2000 కోట్లు కూడా కలెక్ట్ చేస్తుందని అన్నారు. సినిమా గురించి మాట్లాడితే చిరంజీవి నటన గురించి కథ గురించి ఇలా అన్ని విషయాలను ప్రస్థావించాలి అంతేగాని ఏదో మొక్కుబడిగా సైరా 300 కోట్లు చేస్తుంది.. 500 కోట్లు చేస్తుందని చెప్పడం తమ్మారెడ్డి ఆలోచన ఏమై ఉంటుందా అన్న డౌట్ వస్తుంది. సినిమా తనకు నచ్చక అలా అన్నాడా లేక షార్ట్ అండ్ స్వీట్ గా నిజంగానే సినిమా 1000 కోట్లు వసూళు చేయాలని అన్నాడా అని మెగా ఫ్యాన్స్ డౌట్ పడుతున్నారు. హార్ట్ కోర్ మెగా ఫ్యాన్స్ ఇప్పటికే తమ్మా రెడ్డి భరధ్వాజ్ మీద ఎటాక్ చేస్తున్నరు కూడా. 

Related Post

సినిమా స‌మీక్ష