గద్దలకొండ గణేష్ : రివ్యూ

September 20, 2019


img

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ డైరక్షన్ లో వచ్చిన సినిమా గద్దలకొండ గణేష్. వాల్మీకిగా ప్రమోట్ చేయబడిన ఈ సినిమా టైటిల్ చివరి నిమిషంలో మార్చేశారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో రాం ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ సినిమాకు మిక్కి జే మేయర్ మ్యూజిక్ అందించారు. సినిమాలో అధర్వ, పూజా హెగ్దె, మృణాళిని నటించారు.

కథ :

అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేసే అభి (అధర్వ మురళి) డైరక్షన్ చేయాలని అనుకుంటాడు. ఓ గ్యాంగ్ స్టర్ కథతో సినిమా తీయాలని ఫిక్స్ అయిన అభి గద్దలకొండ గణేష్ (వరుణ్ తేజ్) గురించి తెలుసుకుని అతని జీవిత కథ మీదే సినిమా తీయాలని అనుకుంటాడు. గణేష్ గురించి ముందు సీక్రెట్ గా అన్ని విషయాలను తెలుసుకున్న అభి ఓ సందర్భంలో గణేష్ కు విషయం తెలిసి.. అతని కథని తానే చెప్పడం మొదలుపెడతాడు. ఇక తన జీవితంలో జరిగిన విషయాలను అభికి చెబుతుంటాడు గణేష్. అయితే ఈ సినిమాలో తనే హీరోగా చేయాలని అనుకుంటాడు గణేష్. దర్శకుడిని ఒప్పించి గద్దలకొండ గణేషే హీరోగా సీటీమార్ సినిమా చేస్తాడు. ఇన్నాళ్లు తనని చూసి భయపడిన జనాలు ఇప్పుడు అతని మీద ప్రేమ చూపించడం చూసి గణేష్ మనసు మార్చుకుంటాడు. గణేష్ ఎలా మారాడు..? ఎందుకు మారాడు అన్నది సినిమా కథ.           

విశ్లేషణ :

తమిళంలో హిట్టైన సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యి ఇక్కడ మంచి ఫలితాలను అందుకున్నాయి. కోలీవుడ్ లో జిగుర్ తండా సినిమాఉ హరీష్ శంకర్ తెలుగులో గద్దలకొండ గణేష్ గా తెరకెక్కించాడు. అయితే తమిళ సినిమాలో బాబీ సింహా చేసిన రోల్ ను తెలుగులో వరుణ్ తేజ్ చేశాడు. ఆ పాత్ర తమిళంలో కామెడీగా తీర్చిదిద్దగా తెలుగులో వరుణ్ తేజ్ హీరో ఇమేజ్ తోడవడం వల్ల ఇంటెన్స్ తో రాసుకున్నాడు.   

క్యారక్టర్ వెయిట్ అవడం వల్ల డైరక్టర్ క్యారక్టర్ కు కాస్త తక్కువ స్కోప్ ఏర్పడింది. హరీష్ శంకర్ మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా గద్దలకొండ గణేష్ సినిమా వచ్చింది. యాక్షన్, కామెడీ మిక్స్ చేసి దర్శకుడు ప్రతిభ మెచ్చుకునేలా ఉంది. ఫస్ట్ హాఫ్ అంతా సరదాగా నడిపించిన హరీష్ శంకర్ సెకండ్ హాఫ్ తడపడ్డాడు.

అక్కడక్కడ సినిమా కొద్దిగా ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. ఓవరాల్ గా మెగా ఫ్యాన్స్ కు.. మాస్ సినిమాలను మెచ్చే ఆడియెన్స్ కు గద్దలకొండ గణేష్ నచ్చేస్తాడు. పూజా, వరుణ్ ఎపిసోడ్ చాలా బాగుంది. ఎల్లువొచ్చి గోదారమ్మ సాంగ్ అయితే సూపర్ హిట్ అయ్యింది.     

నటన, సాంకేతికవర్గం : 

గద్దలకొండ గణేష్ పాత్రలో వరుణ్ తేజ్ నటన అద్భుతమని చెప్పొచ్చు. సినిమా కోసం వరుణ్ తేజ్ చాలా కష్టపడ్డాడనిపిస్తుంది. యాక్షన్, డైలాగ్, ఎమోషన్ అన్నిటిలో అదరగొట్టాడు. పూజా హెగ్దె ఉన్న కొద్దిసేపు ప్రేక్షకుల మనసులు గెలిచేస్తుంది. అధర్వ పాత్ర మెప్పించింది. సినిమాలో వరుణ్ తేజ్ పాత్రకు సమానమైన రోల్ అధర్వది. కమెడియ సత్య బాగా చేశాడు. బ్రహ్మాజి చిన్న పాత్రే చేసినా అలరించాడు. ఇక తణికెళ్ళ భరణి రోల్ ఆకట్టుకుంది.

ఇక టెక్నికల్ టీం విషయానికొస్తే.. అయాంకా బోస్ సినిమాటోగ్రఫీ బాగుంది. మిక్కి జే మేయర్ మ్యూజిక్ ఇంప్రెస్ చేసింది. బిజిఎం కూడా అదరగొట్టాడు. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్ గా ఉన్నాయి. హరీష్ శంకర్ రీమేక్ ను తన మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు. 

ఒక్కమాటలో :

వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్... మాస్ ఎంటర్టైనర్..!

రేటింగ్ : 3/5



Related Post

సినిమా స‌మీక్ష