శ్రీముఖితో తేల్చుకుంటా..!

September 20, 2019


img

బిగ్ బాస్ సీజన్ 3 రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది. బిగ్ బాస్ టాస్కులే కాదు ఇంటి సభ్యుల ఎత్తులు పై ఎత్తులు షోని సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నాయి. ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ అసలు కలిసి రాలేదని చెప్పాలి. మొదటి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చిన తమన్నా సింహాద్రి రెండు వారాలకే ఎలిమినేట్ అవగా మరో వైల్డ్ కార్డ్ గా వచ్చిన శిల్పా చక్రవర్తి కూడా రెండో వారమే బయటకు వచ్చేసింది.      

అయితే ఇంటి నుండి బయటకు వచ్చాకా సాధారణంగా హౌజ్ గురించి నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కాని ఎలిమినేట్ అయిన శిల్పా మాత్ర బిగ్ బాస్ షో మీద ఎలాంటి కామెంట్స్ చేయలేదు కాని శ్రీముఖి మీద మాత్రం ఫైర్ అవుతుంది. బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నంతవరకు తనతో బాగానే ఉన్న శ్రీముఖి తాను బయటకు వచ్చాక చేసిన ఓ కామెంట్ తనకు నచ్చలేదని అంటుందు. శిల్పాగారి చరిత్ర చాలా ఉంది.. ఆమెకు నేనంటే శిల్పాకి పడదన్న మాటలు చాలా డిస్ట్రబ్ చేశాయంటుంది శిల్పా చక్రవర్తి. హౌజ్ నుండి శ్రీముఖి బయటకు వచ్చాక ఈ విషయాన్ని అడిగి తేల్చుకుంటా అంటుంది శిల్పా. తనకు శ్రీముఖితో ఎలాంటి ఇబ్బంది లేదు కాని ఆమె ఎందుకు అలా అన్నదో అర్ధం కావట్లేదని అన్నారు శిల్పా. మొత్తానికి హౌజ్ నుండి బయటకు రాగానే శ్రీముఖిని శిల్పా టార్గెట్ చేయడం పక్కా అని తెలుస్తుంది. Related Post

సినిమా స‌మీక్ష