గద్దలకొండ గణేష్ సేఫ్ అవ్వాలంటే..!

September 20, 2019


img

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వాల్మీకిగా ఉన్న రావాల్సిన సినిమా కాస్త చివరి నిమిషంలో గద్దలకొండ గణేష్ గా మారింది. అయితే సినిమా ప్రమోషన్స్ లో వరుణ్ తేజ్ పాత్ర పేరు బాగా పాపులర్ అవడం వల్ల సినిమాకు ఆ టైటిల్ ఫిక్స్ చేశారు. టైటిల్ మార్చడం వల్ల సినిమాకు ఏం నష్టం కలగదని అంటున్నారు చిత్రయూనిట్. ఇదిలాఉంటే అసలు ఈ సినిమాకు బడ్జెట్ ఎంత పెట్టారు వరుణ్ తేజ్ హిట్టు కొట్టాలంటే ఎంత రావాలన్నది తెలుసుకోవాలని అందరికి ఉంటుంది.  

వాల్మీకి అలియాస్ గద్దలకొండ గణేష్ బడ్జెట్ 30 కోట్లకు అటు ఇటుగా ఖర్చు పెట్టారట. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో హరీష్ శంకర్ ఈ సినిమా డైరెక్ట్ చేశారు. వరుణ్ తేజ్ మీద 30 కోట్ల బడ్జెట్ కాస్త రిస్కే అయినా కూడా దర్శకుడు హరీష్ శంకర్ మీద కాన్ ఫిడెంట్ తో బడ్జెట్ లో రాజీ పడలేదట నిర్మాతలు. అయితే ఈ సినిమాకు వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ పాతిక కోట్ల దాకా జరిగినట్టు తెలుస్తుంది. డిజిటల్ శాటిలైట్ రైట్స్ మరో 10 కోట్ల దాకా వచ్చాయట. అంటే దాదాపుగా వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ 5 కోట్లు ప్రాఫిట్ లోనే ఉన్నాడని చెప్పొచ్చు. అయితే బిజినెస్ జరిగింది ఓకే కాని ఆ రేంజ్ కలక్షన్స్ రాబడితేనే అసలు హిట్ అని చెప్పుకోవచ్చు.  


Related Post

సినిమా స‌మీక్ష