గోపిచంద్ మళ్లీ అతనితోనే..!

September 20, 2019


img

ఓ కాంబినేషన్ రిపీట్ అయ్యింది అంటే అది ఇదవరకు సూపర్ హిట్ కొట్టి ఉండాలి కాని అలాంటి హిట్ కొట్టకుండానే హీరో దర్శకుడు మరోసారి కలిసి పనిచేస్తున్నారు. హీరో గోపిచంద్ డైరక్టర్ సంపత్ నంది కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాను శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. సమంతతో యూటర్న్ నిర్మించిన ఈ నిర్మాణ సంస్థలో గోపిచంద్ సినిమా రాబోతుంది.    

ఆల్రెడీ సంపత్ నందితో గౌతం నంద సినిమా చేశాడు గోపిచంద్. ఆ సినిమా కథ, కథనాలు బాగున్నా లక్ కలిసి రాలేదు. కాని ఇప్పుడు ఈ కాంబినేషన్ మూవీకి పర్ఫెక్ట్ స్క్రిప్ట్ ప్లాన్ చేశారట. దసరా బరిలో చాణక్యతో గోపిచంద్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఆ సినిమా రిలీజ్ తర్వాత సంపత్ నంది సినిమా సెట్స్ మీదకు వెళ్తుందట. మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుందని గోపిచంద్ కు ఈ సినిమా పక్కా హిట్ ఇచ్చేలా సంపత్ నంది వర్క్ అవుట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. Related Post

సినిమా స‌మీక్ష