ఫ్లాష్.. ఫ్లాష్.. చివరి నిమిషంలో వాల్మీకి టైటిల్ చేంజ్..!

September 19, 2019


img

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ డైరక్షన్ లో వస్తున్న సినిమా వాల్మీకి. ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ చేసిన దగ్గర నుండి బోయ సామాజిక వర్గం నుండి సినిమాపై వ్యతిరేకత వస్తూనే ఉంది. అయితే దాన్ని చిత్రయూనిట్ చాలా లైట్ తీసుకోగా రేపు రిలీజ్ అనగా ఈరోజు సినిమాపై రెండు జిల్లాల్లో రిలీజ్ నిషేధించడంతో చేసేదేం లేక దర్శక నిర్మాతలు ఫైనల్ గా టైటిల్ నే చేంజ్ చేశారు.      

వాల్మీకి టైటిల్ కాస్త గద్దలకొండ గణేష్ గా ఈ సినిమా టైటిల్ చేంజ్ చేసినట్టు చిత్ర దర్శక నిర్మాతలు వెళ్లడించారు. గురువారం రాత్రి అర్జెంట్ ప్రెస్ మీట్ పెట్టిన చిత్రయూనిట్ సినిమా టైటిల్ చేంజ్ చేసినట్టుగా ప్రకటించారు. వాల్మీకి మహర్షి గొప్పతనం అందరికి తెలియాలనే ఈ సినిమాకు ఆ టైటిల్ పెట్టాం. తాము ఎవరిని విమర్శించాలని అనుకోలేదు. సెన్సార్ సభ్యులు కూడా సినిమాకు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. అయితే ఓ హైందవ కుటుంబానికి చెందిన వ్యక్తిగా వాల్మీకి మహర్షి గౌరవాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఓడిపోయానని అన్నారు హరీష్ శంకర్. తాను ఏం తప్పు చేశానో తెలియని పరిస్థితిలో ఉన్నా.. టైటిల్ మార్చడం వల్ల తెలుగు రెండు రాష్ట్రాల్లో ఏమాత్రం నష్టం లేదని అన్నారు హరీష్ శంకర్. సినిమా చూడకుండా కేవలం టైటిల్ చూసి అభ్యంతరాన్ని వ్యక్తం చేయడం బాధించిందని ఎమోషనల్ అయ్యారు దర్శకుడు హరీష్ శంకర్. సో రేపు థియేటర్ లో మనం చూసేది వాల్మీకి కాదు గద్దలకొండ గణేష్ అన్నమాట.             

 Related Post

సినిమా స‌మీక్ష