నాగార్జున ఫాం హౌజ్ లో కుళ్లిన శవం

September 19, 2019


img

ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున ఫాం హౌజ్ లో కుళ్లిపోయిన శవం బయటపడ్డది. షాద్ నగర్ దగ్గరలో పాపిరెడ్డి గూడలో నాగార్జునకు 40 ఎకరాల్లో వ్యవసాయ క్షేత్రం ఉంది. అయితే వ్యవసాయ క్షేత్రంలో పంట పండించేందుకు గాను నాగార్జున తన ఫాం హౌజ్ కు కొందరు వ్యవసాయ నిపుణులను పంపించారట. అయితే ఫాం హౌజ్ లో వారు ఓ కుళ్లిన శవాన్ని కనుగొన్నారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు చెప్పారు.          

ప్రస్తుతం పోలీసులు ఆ శవాన్ని తమ కస్టడీలో తీసుకుని ఆ డెడ్ బాడీ ఎవరిది..? అది హత్యా లేక ఆత్మహత్య అనే కోణలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై నాగార్జున ఇంతవరకు స్పందించలేదు. ప్రస్తుతం ఈ కేసు విషయమై ఎటువంటి క్లూ దొరకలేదని తెలుస్తుంది. తన ఫాం హౌజ్ లో కుళ్లిన శవం ఉందన్న వార్త తెలుసుకున్న నాగార్జున షాక్ అయ్యారని తెలుస్తుంది. మరి ఈ కేసులో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయో చూడాలి. Related Post

సినిమా స‌మీక్ష