సైరా నరసింహా రెడ్డి ట్రైలర్

September 18, 2019


img

ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథతో వస్తున్న సినిమా సైరా నరసింహా రెడ్డి. సురేందర్ రెడ్డి డైరక్ష లో వస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మించారు. అక్టోబర్ 2న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ట్రైలర్ ఈరోజు రిలీజ్ చేశారు. హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ లో సైరా నిర్మాత రాం చరణ్, డైరక్టర్ సురేందర్ రెడ్డి, రమేష్ ప్రసాద్ ఈ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు.     

స్వాతంత్ర సమరయోధుడు నరసింహా రెడ్డి తెళ్లోళ్ల మీద ఎలా తిరుగుబాటు చేశాడో చెప్పే కథే ఈ సైరా నరసింహారెడ్డి సినిమా. సినిమాలో నరసింహా రెడ్డి పాత్రకు ప్రాణం పోశారు మెగాస్టార్ చిరంజీవి . భారీస్థాయిలో వస్తున్న సైరా ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచింది. తెలుగు, తమిళ, హింది, కన్నడ, మళయాళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి రిలీజ్ అవుతుంది. సినిమా ట్రైలర్ అదరగొట్టగా సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.                 Related Post

సినిమా స‌మీక్ష