బిగ్ బాస్ స్టేజ్ పై షూ పాలిష్ చేసిన నాగార్జున..!

September 15, 2019


img

బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తున్న నాగార్జున 7 వారాలుగా చాలా కూల్ గా కామెడీగా అనిపించగా 8వ వారం అది కూడా శనివారం ఎపిసోడ్ లో హాట్ హాట్ గా కనిపించాడు. రావడం రావడం ఎంట్రీ సాంగ్ కూడా వద్దని చెప్పిన నాగార్జున కంటెస్టంట్స్ ముందు ఒక నిమిషం సైలెంట్ గా ఉండి షూ తీసి పాలిష్ చేసుకున్నాడు. మనం చేసే పనిని బట్టి మన స్థాయి ఉండదని.. చేసే తీరుని బట్టి ఉంటుందని పునర్నవి, మహేష్ లకు గూబ అదిరేలా పంచ్ ఇచ్చాడు నాగార్జున.

లాస్ట్ వీక్ జరిగిన ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం టాస్క్ లో భాగంగా వరస్ట్ పర్ఫార్మెన్స్ గా నిలిచిన శ్రీముఖి, పునర్నవి, మహేష్ లకు షూ పాలిష్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు. అయితే బిగ్ బాస్ ఆదేశించిన వెంటనే శ్రీముఖి వెళ్లి టాస్క్ మొదలు పెట్టింది. కాని పునర్నవి, మహేష్ చాలాసేపు అలాంటివి తాము చేయలేమని చెప్పారు. మహేష్ ఇంటి సభ్యుల మాటలకు కన్విన్స్ అయ్యి చేశాడు. పునర్నవి మాత్రం ఐదు గంటల దాకా చేయనని భీష్మించుకు కూర్చుకుంది. అయితే ఎలాగోలా వరుణ్ సందేష్ ఆమెను ఒప్పించి టాస్క్ కంప్లీట్ చేయించాడు. మన పని మనం చేసుకోవడంలో తప్పేం లేదు.. రోజు నా షూ నేనే పాలిష్ చేసుకుంటానని నాగార్జున చెప్పారు. మొత్తానికి శనివారం ఎపిసోడ్ స్టార్టింగ్ కాస్త సీరియస్ గా మొదలైనా తర్వాత నాగ్ కాస్త కోపం తగ్గించుకుని కామెడీగా కనిపించాడు. 

ఇక ఈ వారం ఎలిమినేషన్స్ లో ఉన్న ఐదుగురిలో హిమజ సేఫ్ అయ్యింది. ఇంకా శ్రీముఖి, పునర్నవి, శిల్పా చక్రవర్తి, మహేష్ నామినేషన్ లో ఉన్నారు. వీరిలో ఈరోజు ఒకరు ఎలిమినేట్ అవుతారని తెలుస్తుంది.      Related Post

సినిమా స‌మీక్ష