రియల్ టైగర్ తో ఫైటా..!

September 15, 2019


img

రాజమౌళి చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా గురించి ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ కలిసి నటిస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీలో ఎన్.టి.ఆర్ రియల్ టైగర్ తో ఫైటింగ్ చేస్తాడట. కొమరం భీమ్ గా తారక్, అల్లూరి సీతారామరాజుగా రాం చరణ్ నటిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమాలో తారక్ టైగర్ తో ఫైటింగ్ అదిరిపోతుందట. బాహుబలిలో భళ్లాలదేవ బుల్ ఫైట్ తెలిసిందే. ఆ ఫైట్ సీన్ కోసం రాజమౌళి అండ్ టీం బాగా కష్టపడ్డారు. 

ఇప్పుడు తారక్ టైగర్ ఫైట్ కూడా అంతకుమించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఎన్.టి.ఆర్ స్క్రీన్ నేమ్ యంగ్ టైగర్.. మరి అలాంటి యంగ్ టైగర్ రియల్ టైగర్ తో చేసే ఫైట్ ఎలా ఉండబోతుందో అని నందమూరి ఫ్యాన్స్ ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం బల్గేరియాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే అక్కడ షెడ్యూల్ పూర్తి చేసుకుని హైదరాబాద్ వస్తుందట. ఎట్టిపరిస్థితుల్లో 2020 జూలై 30కి ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ చేయాలని రాజమౌళి ఫిక్స్ అయ్యాడు. సినిమాలో అలియా భట్ ఒక హీరోయిన్ గా నటిస్తుండగా మరో హీరోయిన్ ఎవరన్నది ఇంకా వెళ్లడించలేదు.      Related Post

సినిమా స‌మీక్ష