'మా'కి రాజశేఖర్ భారీ విరాళం

September 15, 2019


img

మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న యాంగ్రీ యంగ్ మెన్ డాక్టర్ రాజశేఖర్ మాకు 10 లక్షల విరాళం అందించారు. నరేష్ అధ్యక్షతన మా కొత్త కార్యవర్గం ఏర్పడింది. అయితే నరేష్ ఈమధ్య 'మా' గురించి సరిగా పట్టించుకోవడం లేదని వార్తలు వచ్చాయి. రాజశేఖర్ తో పాటుగా ప్యానెల్ సభ్యులు మీట్ అయ్యి అధ్యక్షుడు నరేష్ పైన అసంతృప్తి వెళ్లడించారు. సినిమాల బిజీలో పడి నరేష్ తన బాధ్యతలతో పాటుగా ఇచ్చిన హామీలను మర్చిపోయారని అన్నారు. తనకు కుదరకపోతే 'మా' అధ్యక్ష పదవికి రాజీనామా చేయాల్సిందని కోరారు.        

ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు మా కొత్త నిధులు సేకరించాలి తప్ప ఖజానాలో ఉన్న డబ్బు ఖర్చు పెట్టకూడదు. ఈ క్రమంలో రాజశేఖర్ 'మా'కు 10 లక్షల విరాళం ఇచ్చి 'మా' అభివృద్ధి కోసం.. సంక్షేమ కార్యక్రమాల కోసం ఇవి వాడుతామని అన్నారు. 10 లక్షల విరాళం ఇచ్చి తన గొప్ప మనసు చాటుకున్నారు రాజశేఖర్. వచ్చిన ఆరోపణలకు నరేష్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ప్రస్తుతం ఆయన సినిమాల్లో బిజీగా ఉండటం వల్ల 'మా' ఇష్యూపై మాట్లాడేందుకు వీలు కుదరడం లేదని తెలుస్తుంది.     

 


Related Post

సినిమా స‌మీక్ష