నాని ఇంకా స్టార్ అవలేదా..!

September 14, 2019


img

నాచురల్ స్టార్ నాని విక్రం కె కుమార్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా గ్యాంగ్ లీడర్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో నాని సరసన ప్రియాంకా అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించింది. రివెంజ్ స్టోరీనే కామెడీగా తీసిన దర్శకుడు విక్రం కుమార్ ప్రతిభ మెచ్చుకోదగినదని చెప్పొచ్చు. మొదటి షో నుండి ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే సినిమాలో కొన్ని లాజిక్కులు మిస్సైనట్టు తెలుస్తుంది. 

ఇదిలాఉంటే స్టార్ సినిమా హిట్ టాక్ వస్తే ఆ ప్రభావం కలక్షన్స్ మీద భారీగా ఉంటుంది. అసలు ఫ్లాప్ టాక్ వచ్చినా మొదటి రోజు స్టార్ సినిమాలు కలక్షన్స్ కుమ్మేస్తాయి. అలాంటిది నాని సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా సరే 5 కోట్లు దాటి వసూళ్లు రావట్లేదు. నాని కూడా స్టార్ హీరోనే.. అతనికి నాచురల్ స్టార్ అన్న స్క్రీన్ నేమ్ ఉంది. మరి నాని విషయంలో బాక్సాఫీస్ లెక్కలు ఎందుకు తప్పుతున్నాయో అర్ధం కావట్లేదు. అయితే నాని సినిమా బడ్జెట్ తక్కువే.. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా 25 నుండి 30 కోట్ల లోపే దాన్ని బట్టే మొదటి రోజు 4 నుండి 5 కోట్లు వచ్చినా హిట్ అన్నట్టే లెక్క. నాని గ్యాంగ్ లీడర్ ఫస్ట్ డే తెలుగు రెండు రాష్ట్రాల్లోనే 4.55 కోట్లు రాబట్టింది. గ్యాంగ్ లీడర్ సినిమాతో నాని మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.  Related Post

సినిమా స‌మీక్ష