కీర్తి సురేష్ ఈజ్ ఆన్ ఫామ్

September 14, 2019


img

మహానటి సినిమాతో నేషనల్ అవార్డ్ సైతం దక్కించుకున్న కీర్తి సురేష్ తెలుగు తమిళ భాషల్లో వరుస సినిమాలు చేస్తుంది. తెలుగులో మిస్ ఇండియా సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కీర్తి సురేష్ లేటెస్ట్ గా మరో లేడీ ఓరియెంటెడ్ మూవీని ఓకే చేసింది. కోలీవుడ్ స్టార్ డైరక్టర్ కార్తిక్ సుబ్బరాజు నిర్మాణంలో కీర్తి సురేష్ లీడ్ రోల్ లో చేస్తున్న సినిమా ముహుర్త కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.  

కార్తీక్ సుబ్బరాజు తన స్టోన్ బెంచ్ ఫిల్మ్ నిర్మాణ ప్రొడక్షన్స్ లో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ మూవీ ద్వారా ఈశ్వర్ కార్తిక్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. కీర్తి సురేష్ నటిస్తున్న 24వ సినిమా ఇది. కార్తిక్ పళని సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాను 2020 స్టార్టింగ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. వరుస సినిమాలతో కీర్తి సురేష్ మంచ్ ఫాంలో ఉందని చెప్పొచ్చు. Related Post

సినిమా స‌మీక్ష