వాల్మీకి ఈవెంట్ కు గెస్ట్ అతనేనా..!

September 14, 2019


img

మెగా హీరో వరుణ్ తేజ్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా వాల్మీకి. కోలీవుడ్ సూపర్ హిట్ మూవీ జిగుర్తండా రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ నెగటివ్ రోల్ చేస్తున్నాడని తెలిసిందే. రీసెంట్ గా రిలీజైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచాయి. సినిమాలో తమిళ నటుడు అధర్వ కూడా నటిస్తున్నాడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో రాం ఆచంట, గోపి ఆచంట నిర్మించిన ఈ సినిమాకు మిక్కి జే మేయర్ మ్యూజిక్ అందించారు.

ఈ నెల 20న రిలీజ్ అవుతున్న వాల్మీకి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సెప్టెంబర్ 15న హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరుగనుంది. ఈ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా విక్టరీ వెంకటేష్ వస్తున్నాడని తెలుస్తుంది. వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి ఎఫ్-2 సినిమా చేశారు. క్రేజీ మల్టీస్టారర్ గా వచ్చిన ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ సినిమా చేస్తున్న టైంలో వెంకీ, వరుణ్ ఇద్దరు చాలా క్లోజ్ అయ్యారు. అందుకే వరుణ్ తేజ్ సినిమా ఈవెంట్ కు వెంకటేష్ వస్తున్నాడు. అదీకాకుండా వెంకటేష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చిన సినిమా పక్కా హిట్ అనే సెంటిమెంట్ కూడా ఉంది. మరి ఆ సెంటిమెంట్ నిజం చేస్తూ వరుణ్ తేజ్ వాల్మీకి హిట్ కొడుతుందో లేదో చూడాలి.   Related Post

సినిమా స‌మీక్ష