గ్యాంగ్ లీడర్ : రివ్యూ

September 13, 2019


img

రేటింగ్ : 3/5

కథ :

పెన్సిల్ పార్ధసారధి (నాని) ఓ రివెంజ్ నావెల్ రైటర్. హాలీవుడ్ సినిమాలు కాపీ కొట్టి వాటిని నవలలుగా రాస్తుంటాడు. సడెన్ గా ఓ ఐదుగురు ఆడవాళ్లు వచ్చి అతన్ని సహాయం అడుగుతారు. తమని ఒంటరిగా చేసిన వాడిని చంపాలన్న విషయాన్ని పార్ధసారధికి చెబుతారు. ముందు ఆ రివెంజ్ కు నో చెప్పిన నాని తర్వాత ఓకే చెబుతాడు. ఇక పెన్సిల్ పార్ధసారధి ఇంకా ఆ అతని గ్యాంగ్ విలన్ కోసం వెతుకుతాడు. సరిగ్గా 14 నెలలు ముందు జరిగిన ఓ బ్యాంక్ రాబరీలో ఐదుగురు వ్యక్తులు చంపడతాడు. ఆరుగురు కలిసి బ్యాంక్ రాబరీ చేస్తే ఐదుగురిని చంపి ఒక్కడే దొంగిలించిన 300 కోట్లను ఎత్తుకెళ్తాడు. అతన్ని వెతికి పట్టుకునే క్రమంలో పార్ధసారధి ఎలాంటి ప్లాన్ చేశాడ్..? అసలు ఇంతకీ ఆ విలన్ ఎవరు..? పార్ధసారధి అతన్ని ఎలా శిక్షించాడు అన్నది సినిమా కథ.

విశ్లేషణ : 

విక్రం కె కుమార్ అన్ని సినిమాల కథల్లానే లైన్ కొత్తగా లేకున్నా అది తెలియకుండా మ్యానేజ్ చేశాడు. ఇక కథనం కూడా కొన్నిచోట్ల ల్యాగ్ అయినట్టు అనిపించినా మెప్పించాడు. సొంత తండ్రిని డబ్బు కోసం చంపిన విలన్.. రేసర్ గా అతడి ప్రయాణం సాగాలంటే కావాల్సిన మొత్తం ఎంతన్నది తెలుసుకుంటాడు. వేరే వాళ్ల ప్లాన్ కోసం 300 కోట్లు రాబరీ చేసి అందులో పాల్గొన్న ఐదుగురిని చంపేసి మొత్తాన్ని విలన్ దేవ కాజేస్తాడు.

అయితే ఆసరాని కోల్పోయి అనాథగా మిగిలిన ఐదుగురు ఆడవాళ్లకు పెన్సిల్ పార్ధసారధి హెల్ప్ గా ఉంటాడు. వారితో పెన్సిల్ ప్రయాణం సినిమా కథనం సాగుతుంది. ఫస్ట్ హాఫ్ అనంతా ఫ్రెష్ గా అనిపిస్తుంది. కథలోని ట్విస్టులన్ని ఫస్ట్ హాఫ్ లోని వచ్చినట్ట్టు అనిపిస్తుంది. అయితే క్లైమాక్స్ సినిమాకు బాగా హెల్ప్ అయ్యింది.

విక్రం కుమార్ లో ఉండే ప్రతిభతో గ్యాంగ్ లీడర్ తెరకెక్కించాడు. అయితే అక్కడక్కడ కొంత ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. లిమిటెడ్ బడ్జెట్ లో సేఫ్ ప్రాజెక్ట్ గా నాని గ్యాంగ్ లీడర్ చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నిలిచింది. 

నటన, సాంకేతికవర్గం :

పెన్సిల్ పార్ధసారధి పాత్రలో నాని అదరగొట్టాడు. ఇలాంటి పాత్రలకు నానినే పర్ఫెక్ట్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్ కూడా బాగానే మెప్పించింది. తన లుక్స్ తో మరో నాచురల్ బ్యూటీ తెలుగు పరిశ్రమకు పరిచయమైందని అనిపిస్తుంది. సీనియర్ నటి లక్ష్మి, శరణ్యలు కూడా బాగా చేశారు. వెన్నెల కిశోర్, ప్రియదర్శి, సత్య పాత్రలు ఉన్న కాసేపు జస్ట్ అలా నవ్వించాయి. కార్తికేయ విలనిజం బాగుంది. హీరోగా చేస్తూనే విలన్ గా చేయడం గొప్ప విషయం.

ఇక టెక్నికల్ టీం గురించి చెప్తే.. సినిమాకు పీసి శ్రీరాం సినిమాటోగ్రఫీ సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు. అనిరుద్ మ్యూజిక్ ఇంప్రెస్ చేసింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. కథ, కథనాల్లో దర్శకుడు విక్రం కె కుమార్ వర్క్ మెప్పించింది. తన మార్క్ యూనిక్ స్టైల్ ను గ్యాంగ్ లీడర్ లో కూడా ఫాలో అయ్యాడు విక్రం కె కుమార్. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సినిమాకు ఎంత కావాలో అంత బడ్జెట్ పెట్టారు. 

ఒక్కమాటలో :

నాని గ్యాంగ్ లీడర్.. రివెంజ్ అండ్ ఫన్ ఎంటర్టైనర్..!



Related Post

సినిమా స‌మీక్ష