సందీప్ వంగ డేర్ స్టెప్

September 13, 2019


img

తెలుగులో అర్జున్ రెడ్డి సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్న సందీప్ వంగ అదే సినిమా బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి సెన్సేషనల్ హిట్ అందుకున్నాడు. తెలుగులోనే కాదు బాలీవుడ్ లో కూడా సందీప్ వంగకి మంచి క్రేజ్ ఏర్పడింది. అందుకే తన నెక్స్ట్ మూవీ టాలీవుడ్ లో కాకుండా బాలీవుడ్ లోనే చేయాలని చూస్తున్నాడట. బాలీవుడ్ స్టార్స్ కూడా సందీప్ తో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలుస్తుంది.

లేటెస్ట్ గా రణ్ బీర్ కపూర్ తో సందీప్ సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. సందీప్ చెప్పిన లైన్ నచ్చడంతో రణ్ బీర్ కపూర్ ఓకే చెప్పాడట. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే బాలీవుడ్ లో ఈ సినిమాను సందీప్ నిర్మిస్తాడని అంటున్నారు. అర్జున్ రెడ్డి సినిమాను కూడా సొంతంగా నిర్మించి సూపర్ హిట్ అందుకున్నాడు సందీప్ వంగ. కబీర్ సింగ్ బయట ప్రొడక్షన్ లో చేశాడు. ఇక హిందిలో కూడా తన ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు ఈ దర్శకుడు. మరి సందీప్ చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.     



Related Post

సినిమా స‌మీక్ష