ప్రభాస్ తో ఛాన్స్ వస్తే..!

September 11, 2019


img

ఆరెక్స్ 100 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న పాయల్ రాజ్ పుత్ ఆ సినిమాలో తన అంద చందాలతో కుర్రాళ్ల మతులు పోగొట్టింది. ప్రస్తుతం ఆర్.డి.ఎక్స్ లవ్ అంటూ మరో క్రేజీ సినిమాతో వస్తున్న పాయల్ రాజ్ పుత్ ఆ సినిమా ప్రమోషన్స్ లో బిజీ అయ్యింది. ఊరిని కాపాడేందుకు అలివేలు అన్న అమ్మాయి ఏం చేసింది అన్నదే ఆర్.డి.ఎక్స్ లవ్ సినిమా కథ. ఇక ఈ సినిమాతో పాటుగా వెంకటేష్ వెంకీమామ, రవితేజతో డిస్కో రాజా సినిమాల్లో నటిస్తుంది పాయల్.  

అయితే ఇంటర్వ్యూలో భాగంగా విజయ్ దేవరకొండ, ప్రభాస్ ఈ ఇద్దరిలో ఎవరు హాట్ అంటే. క్షణం ఆలోచించకుండా ప్రభాస్ అనేసింది పాయల్ రాజ్ పుత్. ప్రభాస్ లో ఎప్పుడు ఒక స్పార్క్ ఉంటుంది అది తనకు ఇష్టమని.. అతని స్టైల్, యాటిట్యూడ్ కు తను పెద్ద ఫ్యాన్స్ అంటుంది పాయల్. అందుకే ప్రభాస్ తో ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నానని.. ఆ అవకాశం వస్తే తప్పకుండా చేస్తా అంటుంది పాయల్ రాజ్ పుత్.    Related Post

సినిమా స‌మీక్ష