కాజల్ మరీ ఇంత చీపా..!

September 10, 2019


img

సౌత్ లో ఎంత క్రేజ్ వచ్చినా.. ఇక్కడ స్టార్ స్టేటస్ అనుభవిస్తున్నా.. బాలీవుడ్ లో ఛాన్స్ వస్తే చాలు ఎగిరి గంతేస్తుంటారు స్టార్ హీరోయిన్స్. అడపాదడపా అవకాశాలు వస్తున్నా సరే అక్కడ మాత్రం వీరు క్లిక్ అవరు. లేటెస్ట్ గా కాజల్ అగర్వాల్ కు బాలీవుడ్ ఛాన్స్ వచ్చింది. సంజయ్ గుప్తా డైరక్షన్ లో ముంబై సాగా సినిమాలో నటిస్తుంది కాజల్. అయితే ఈ సినిమాలో ఆమె 17 ఏళ్ల అమ్మాయి పాత్రలో కనిపించనుందట.      

ఇక ఈ మూవీలో నటించేందుకు గాను కాజల్ కేవలం 30 లక్షల రెమ్యునరేషన్ మాత్రం తీసుకుంటుందని టాక్. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ అయిన కాజల్ ఇక్కడ సినిమా అంటే మాత్రం కోటికి తక్కువ తీసుకోదు. చిరుతో జోడీ కట్టిన తర్వాత 1.75 కోట్ల నుండి 2 కోట్ల దాకా డిమాండ్ చేసింది. బాలీవుడ్ లో కాబట్టి ఇక్కడ హిట్ పడితే ఆ తర్వాత అవకాశాలు వస్తాయన్న ఆలోచనతో కాజల్ 30 లక్షలకే చేస్తుందని భావిస్తున్నారు. అయితే ఎంత తక్కువగా చేసినా మరీ 30 లక్షలకు చేసే ఛాన్స్ లేదు. అయితే ఈ వార్తలపై కాజల్ ఏమైనా స్పందిస్తుందో లేదో చూడాలి.       Related Post

సినిమా స‌మీక్ష