RDX లవ్ ట్రైలర్.. ఊరి కోసం అమ్మాయి పోరాటం..!

September 10, 2019


img

ఆరెక్స్ 100 సినిమాతో యువత హృదయాలను కొల్లగొట్టిన పాయల్ రాజ్ పుత్. ఆ ఒక్క సినిమాతో పది సినిమాల క్రేజ్ ఏర్పరచుకుంది. ఆ సినిమా తర్వాత ఓ పక్క వెంకటేష్ లాంటి స్టార్ హీరోతో సినిమాలు చేస్తున్న పాయల్ రాజ్ పుత్ మరోపక్క చిన్న బడ్జెట్ సినిమాలను చేస్తుంది. లేటెస్ట్ గా ఆరెక్స్ 100 టైపులోనే ఆర్డిఎక్స్ లవ్ అంటూ ఓ సినిమా చేస్తుంది పాయల్ రాజ్ పుత్. తేజుస్ కంచర్ల హీరోగా నటించిన ఈ సినిమాను శంకర్ భాను డైరక్ట్ చేశారు.

ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ రిలీజైంది. మొన్నమధ్య టీజర్ తో అంతా బూతు పురాణమే అన్న ఫీలింగ్ తెప్పించి సినిమాపై నెగటివ్ టాక్ తెచ్చుకున్న ఆర్డిఎక్స్ లవ్ సినిమా ట్రైలర్ కొత్తగా ఉంది. ఊరి సమస్య కోసం ప్రజలంతా ప్రాణాలివ్వడానికి సిద్ధమవగా అదే ఊరిలో ఉంటున్న అలివేలు అదే మన హీరో పాయల్ రాజ్ పుత్ ఏం చేసింది అన్నది సినిమా కథ.      





Related Post

సినిమా స‌మీక్ష