పవన్ కోసం ముగ్గురు నిర్మాతలు

September 10, 2019


img

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు చేస్తాడా లేదా అన్న కన్ ఫ్యూజన్ తొలగినట్టే. కేవలం పార్టీ విధానాల ద్వారానే జనాల్లోకి వెళ్లడం కష్టమే అని భావించాడు కాబోలు తనకు ఇంతటి క్రేజ్ తెచ్చిన సినిమాలను ముందు వదిలేయాలని అనుకున్న పవన్ మళ్లీ తిరిగి సినిమాలు చేయాలని అనుకుంటున్నాడు. ఇంతకుముందు అడ్వాన్స్ తీసుకున్న వారి నుండి ఫోర్స్ రావడంతో పవన్ ఇక సినిమాలు చేస్తాడని తెలుస్తుంది.    

ఇక పవన్ కోసం ఏకంగా ముగ్గురు ప్రొడ్యూసర్స్ రెడీగా ఉన్నారని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్ బయోపిక్ తీసిన క్రిష్ డైరక్షన్ లో ఏ.ఎం.రత్నం నిర్మాతగా ఓ సినిమా లైన్ లో ఉందట. ఇక బాలీవుడ్ పింక్ రీమేక్ ను పవన్ తో చేయాలని దిల్ రాజు ప్రయత్నాలు చేస్తున్నాడట. ఇవి రెండు కాకుండా మైత్రి మూవీ మేకర్స్ కూడా పవన్ తో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నారట. మరి ఈ మూడు సినిమాల్లో పవన్ ఏది ఓకే చేస్తాడు. ఏది మొదలుపెడతారు అన్నది తెలియాల్సి ఉంది.   Related Post

సినిమా స‌మీక్ష