ప్రతిరోజు పండుగే ప్రీ లుక్

September 10, 2019


img

మెగా హీరో సాయి ధరం తేజ్ హీరోగా మారుతి డైరక్షన్ లో వస్తున్న సినిమా ప్రతిరోజు పండుగే. చిత్రలహరి తర్వాత సాయి ధరం తేజ్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. శైలజా రెడ్డి అల్లుడు తర్వాత మారుతి ఈ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబందించిన ప్రీ లుక్ రిలీజ్ చేశారు. రేపు రాత్రి 8 గంటలకు సినిమా ఫస్ట్ లుక్ వస్తుందట. రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రీ లుక్ ఇంప్రెస్ చేసింది.       

ఓ మధ్య వయస్కుడి చేతిని పట్టుకున్న హీరో చెయ్యితో ప్రీ లుక్ రిలీజ్ చేశారు. ట్యాగ్ లైన్ గా వేలు విడువని బంధం అని కూడా పెట్టారు. ఇక బ్యాక్ డ్రాఫ్ లో ఓ విలేజ్ కనబడుతుంది. చూస్తుంటే ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతుందని అనిపిస్తుంది. సాయి ధరం తేజ్ తో రాశి ఖన్నా నటించిన సుప్రీం సూపర్ హిట్ అవగా మరోసారి ఈ హిట్ కాంబినేషన్ రిపీట్ చేస్తున్నారు. శైలజా రెడ్డి అల్లుడు ఇచ్చిన షాక్ వల్ల మారుతి ప్రతిరోజు పండుగ సినిమాను చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడట. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.   


Related Post

సినిమా స‌మీక్ష