మహేష్ మళ్లీ అతనితోనేనా..!

September 09, 2019


img

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం అనీల్ రావిపుడి డైరక్షన్ లో సరిలేరు నీకెవ్వరు సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు, అనీల్ సుంకర, మహేష్ బాబు కలిసి నిర్మిస్తున్న ఈ మూవీలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సరిలేరు నీకెవ్వరు సినిమా రష్ చూసి మహేష్ కు సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చిందట. అందుకే ఈ మూవీ షూటింగ్ టైంలోనే మహేష్ కోసం అనీల్ మరో లైన్ చెప్పగా అది కూడా బాగుండటంతో చేసేద్దామని అన్నాడట.    

ఈమధ్య పూరి మహేష్ పై కామెంట్ చేస్తూ కేవలం సక్సెస్ లో ఉన్న వాళ్లతోనే మహేష్ సినిమా చేస్తాడని అన్నాడు. అయితే అనీల్ కు మరో ఛాన్స్ ఇస్తూ మహేష్ అది నిజం చేస్తున్నాడని చెప్పొచ్చు. సరిలేరు నీకెవ్వరు సినిమా సూపర్ హిట్ అయితే మాత్రం అనీల్ తో మహేష్ మరో సినిమా ఫిక్స్ అయినట్టే లెక్క. అయితే ఈ గ్యాప్ లో అనీల్ మరో సినిమా చేసిన తర్వాత మహేష్ సినిమా ఉంటుందని టాక్.         


Related Post

సినిమా స‌మీక్ష