అలి రెజా ఎలిమినేటెడ్..!

September 09, 2019


img

బిగ్ బాస్ సీజన్ 3, 7వ వారం ఎలిమినేషన్ ప్రక్రియ చాలా ఎమోషనల్ గా సాగింది. హౌజ్ లో స్ట్రాంగ్ కంటెస్టంట్ గా చెప్పుకుంటున్న అలి రెజాని ఇంటి నుండి బయటకు పంపించారు. ఈ వారం రవి, శ్రీముఖి, రాహుల్, మహేష్, అలి నామినేషన్స్ లో ఉండగా శనివారం రాహుల్ ను సేఫ్ చేశాడు నాగార్జున. ఇక నిన్నటి ఎపిసోడ్ లో అలి రెజాని ఇంటికి పంపించేశారు. 

ఎంత స్ట్రాంగ్ కంటెస్టంట్ అని అనుకున్నా అలి రెజా కోపాన్ని ఎప్పుడూ ఇంటి సభ్యులు తప్పుపడుతూనే ఉన్నారు. కొందరు అలి రెజాకు సపోర్ట్ గా కూడా ఉన్నారు. ఈ సీజన్ లో 6 వారాల్లో ఒక్కసారి కూడా నామినేట్ అవని అలి 7వ వారం నామినేట్ అవడంతో డైరెక్ట్ గా ఎలిమినేట్ అయ్యాడు. ఇంట్లోని మెంబర్స్ కూడా అలి ఎలిమినేట్ అవడాన్ని జీర్ణించుకోలేదు. ఊహించింది జరిగితే అది బిగ్ బాస్ ఎలా అవుతుంది. బిగ్ బాస్ సీజన్ 2లో హోస్ట్ గా చేసిన నాని నిన్నటి ఎపిసోడ్ లో కనిపించి సందడి చేశాడు. తన గ్యాంగ్ లీడర్ సినిమా ప్రొమోషన్స్ లో నాని బిగ్ బాస్ కు వచ్చాడు.   

 


Related Post

సినిమా స‌మీక్ష