సినిమాకు వాళ్లే పునాది రాళ్లు..!

September 09, 2019


img

సినిమా పరిశ్రమలో ప్రొడక్షన్ మేనేజర్ల పని చాలా కష్టంగా ఉంటుంది. నిర్మాతకు నటీనటుల మధ్య వారధిగా ఉండే ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ సినిమాకు కావాల్సిన ప్రాపర్టీస్ అన్ని ఎరేంజ్ చేస్తుంటారు. ఓ విధంగా అటు నిర్మాత తాలూఖా బడ్జెట్ అవగాహనను.. దర్శకుడి తాలూఖా క్రియేటివిటీని దృష్టిలో పెట్టుకుని ప్రొడక్షన్ మేనేజర్లు పనిచేయాల్సి ఉంటుంది.

అవును ఇంతకీ ఈ వివరణ అంతా దేనికి అంటే ఆదివారం హైదరాబాద్ లో తెలుగు సిని పరిశ్రమ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్ రజతోత్సవ వేడుక జరిగింది. ఈ ఈవెంట్ కు స్పెషల్ గెస్టులుగా మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ అటెండ్ అయ్యారు. ఈవెంట్ లో భాగంగా మాట్లాడిన చిరు ప్రొడక్షన్ మేనేజర్లను ఆకాశానికెత్తేశారు.

సినిమా ఆఫీస్ తీసినప్పటి నుండి రిలీజ్ వరకు మేనేజర్లు పడే కష్టం అంతా ఇతా కాదు. వారి కష్టాన్ని తాను స్వయంగా చూశానని చెప్పారు చిరంజీవి. సినిమా అనేది ఒక అద్భుతమైన సౌధం అనుకుంటే దానికి మేనేజర్లు పునాది రాళ్ల వంటివారని అన్నారు చిరు. షూటింగ్ జరుగుతున్నంతసేపు తక్కువ నిద్రపోయేది మేనేజర్లే అన్నారు చిరంజీవి. సైరా సినిమా కోసం తన మేనేజర్ అవతల వాళ్ల కాళ్లను మీద కూడా పడ్డారని సీక్రెట్ రివీల్ చేశారు చిరంజీవి. ఇక ఈ ఈవెంట్ కు మరో గెస్ట్ గా వచ్చిన మహేష్ కూడా ఈ వేడుక సందర్భంగా చిరంజీవి గారిని కలవడం కొత్త ఎనర్జిఈని ఇచ్చిందని అన్నారు. ఫ్యూచర్ లో మరిన్ని సక్సెస్ ఫుల్ ఈవెంట్లు చేయాలని అన్నారు. ఇక తన ప్రొడక్షన్ లో 32 సినిమాలు వచ్చాయి కాబట్టి ప్రొడక్షన్ మేనేజర్ల యూనిట్ కు 32 లక్షలు విరాళాలు ప్రకటించారు దిల్ రాజు. Related Post

సినిమా స‌మీక్ష