సాహో : రివ్యూ

August 30, 2019


img

రేటింగ్ : 2/5

కథ :

వాజి నగరంలో అండర్ వరల్డ్ డాన్ గా ఉన్న రాయ్ (జాకీ ష్రాఫ్)ను మరో గ్యాంగ్ స్టర్ పృధ్వి రాజ్ తనయుడు దేవ్ రాజ్ (చుంకీ పాండే) యాక్సిడెంట్ చేయించి చంపేయిస్తాడు. అతని తర్వాత దేవ్ రాజ్ డాన్ గా మారాలని అనుకుంటాడు. అయితే రాయ్ దగ్గర ఉన్న 2 లక్షల కోట్లు ఒక లాకర్ లో ఉంటాయి. ఓ బ్లాక్ బాక్స్ ద్వారా దాన్ని దాచిపెడతారు దాని కోసం దేవ్ రాజ్ తన మనుషులతో వెతికిస్తుంటాడు. ఇంతలో ముంబైలో ఓ కేసు విచారణకై అశోక్ చక్రవర్తి (ప్రభాస్) వస్తాడు. అతనితో పాటు అమృత నాయర్ (శ్రద్ధ కపూర్) కూడా ఈ కేసు విచారణలో పాల్గొంటుంది. బ్లాక్ బాక్స్ కోసం కల్కి (మందిరా బేడీ)ని పంపిస్తారు రాయ్ కొడుకు విశ్వక్ (అరుణ్ విజయ్) ఇంతలో ఆ బ్లాల్ బాక్స్ ను అశోక్ కాజేస్తాడు. ఇంతకీ అశోక్ దొంగ పోలీసా..? అశోక్ చక్రవరి ఎవరు..? దేవ రాజ్, రాయ్ లకు అశోక్ కు సంబంధం ఏంటి.. మధ్యలో అశోక్ సాహోగా ఎలా మారాడు అన్నది సినిమా కథ.  

విశ్లేషణ :

గ్యాంగ్ స్టర్ కథలు చెప్పే సినిమాలు ఏవైనా సరే ప్రేక్షకులను సినిమాలో ఇన్వాల్వ్ చేసేలా బిగించిన కథనం ఉండాలి. అంతేకాదు కథలో కొన్ని ట్విస్టులు కూడా ఉండాలి. అయితే సాహోలో అవి రెండు మిస్సయ్యాయని చెప్పొచ్చు. సుజిత్ కథ, కథనాలు ఏమాత్రం ఆకట్టుకోలేదు. కేవలం భారీ యాక్షన్ సీన్స్ తప్ప సినిమాలో చెప్పుకోదగ్గ విషయం ఏమి లేదు.

ఫస్ట్ హాఫ్ అంతా హీరోనే పోలీస్ గా చూపించిన డైరక్టర్ ఇంటర్వల్ లో ట్విస్ట్ ఇస్తాడు. అయితే సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ పార్ట్ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. సెకండ్ ఏమాత్రం ఆకట్టుకోని కథనంతో నడుస్తుంది. ప్రీ క్లైమాక్స్ ఫైట్ ఒక్కటి కాస్త పర్వాలేదు అన్నట్టు ఉంటుంది. సినిమా అంతా భారీ ఫైట్లు, భారీతనంతో తీశారే తప్ప సరైన కథ కథనాలు లేవని చెప్పొచ్చు.

కేవలం ప్రభాస్ ఫ్యాన్స్ కు మాత్రమే మాస్ ఆడియెన్స్ కు మాత్రమే తప్ప సాధారణ ప్రేక్షకులకు బోర్ కొడుతుందని చెప్పొచ్చు. ఆల్రెడీ తెలుగులో వచ్చిన చాలా సినిమాల కథల్లానే సాహో కథ ఉంటుంది. ఈ కథకు ఇంత బడ్జెట్ అవసరమా అన్న డౌట్ కూడా వస్తుంది. ఫైనల్ గా ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే చూడదగిన సినిమా సాహో.

నటన, సాంకేతిక వర్గం :

అశోక్ చక్రవర్తిగా పరిచయమై సిద్ధార్థ్ నందన్ సాహోగా ప్రభాస్ నటన బాగుంది. అయితే కొన్ని చోట్ల ప్రభాస్ ఎందుకో డల్ గా అనిపించాడు. యాక్షన్ ఎపిసోడ్స్ లో ప్రభాస్ అదరగొట్టాడు. ఇక శ్రద్ధా కపూర్ నటన మెప్పిస్తుంది. సినిమాలో బాలీవుడ్ స్టార్స్ చాలామంది ఉన్నారు. ఎవరికి వారు తమ పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించారు.

ఇక సాహో టెక్నికల్ టీం విషయానికి వస్తే.. మథి సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా కోసం కెమెరా మెన్ చాలా కష్టపడ్డాడని చెప్పొచ్చు. జిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. సినిమా అంతా మ్యూజిక్ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కథ, కథనాల్లో దమ్ము లేదు. దర్శకుడు సుజిత్ ఇంత పెద్ద భారీ బడ్జెట్ ను బాగానే హ్యాండిల్ చేసినా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమయ్యాడు.

ఒక్కమాటలో :

సాహో.. ఓన్లీ ఫర్ ప్రభాస్ ఫ్యాన్స్..!



Related Post

సినిమా స‌మీక్ష