'ఎవరు' సినిమాపై మహేష్ కామెంట్

August 26, 2019


img

సినిమా ఏదైనా మనసుకి నచ్చితే ఆ సినిమా గురించి ప్రస్థావించి ప్రమోషన్స్ కు సపోర్ట్ గా నిలుస్తున్నారు టాలీవుడ్ స్టార్స్. రీసెంట్ గా అడివి శేష్ హీరోగా వెంకట్ రాంజీ డైరక్షన్ లో వచ్చిన సినిమా ఎవరు. ఆగష్టు 15న రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. థ్రిల్లర్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు అడివి శేష్.  

చిన్న బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. ఇప్పటికే సినిమా చూసి సూపర్ అనేశాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ వంతు వచ్చింది. ఎవరు సినిమా చూసిన మహేష్ సినిమా టీంను పొగుడుతూ ట్వీట్ చేశారు. ఎవరు సినిమా చూశాను.. ఓ మంచి కాన్సెప్ట్ తో సినిమాను చాలా అద్భుతంగా తీశారని.. సీట్ ఎడ్జ్ మీద కూర్చునేలా ఎక్సైట్మెంట్ గురించేసిన థ్రిల్లర్ సినిమా ఇదని అన్నారు. డైరక్టర్ వెంకట్ రాంజీ బాగా డైరెక్ట్ చేశారు. అడివి శేష్ తో పాటుగా టీం అందరికి కంగ్రాట్స్ చెప్పాడు మహేష్.  

మహేష్ చేసిన ట్వీట్ కు అడివి శేష్ కూడా ఇంట్రెస్టింగ్ రిప్లై ఇచ్చాడు. ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్ లో మీ సపోర్ట్ మరవలేనిది. మీ నిర్మాణంలో చేస్తున్న మేజర్ తో మీరు గర్వపడేలా చేస్తానని అన్నాడు అడివి శేష్. మహేష్ నిర్మాతగా చేస్తున్న మేజర్ సినిమాలో అడివి శేష్ హీరోగా నటిస్తున్నాడు. ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఈ సినిమా రిలీజ్ ఉంటుందని టాక్.   Related Post

సినిమా స‌మీక్ష