తమిళ ఇస్మార్ట్ శంకర్ ఎవరంటే..!

August 26, 2019


img

తెలుగులో సూపర్ హిట్టైన సినిమాలు తమిళ, హింది భాషల్లో రీమేక్ చేయడం కామనే. ఈమధ్య తెలుగు సినిమాలు ఇతర భాషల్లో కూడా రాణిస్తున్నాయి. లేటెస్ట్ గా తెలుగులో సూపర్ హిట్టైన ఇస్మార్ట్ శంకర్ పై కోలీవుడ్ మేకర్స్ కన్ను పడ్డది. తమిళంలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఇస్మార్ట్ శంకర్ రీమేక్ రైట్స్ కొన్నారట. ఇస్మార్ట్ శంకర్ తమిళ రీమేక్ లో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తాడని తెలుస్తుంది.

పూరి డైరక్షన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా చేశాడు. రామ్ కెరియర్ లో కూడా ఇస్మార్ట్ శంకర్ హయ్యెస్ట్ కలెక్ట్ చేసిన సినిమాగా నిలిచింది. పూరి, ఛార్మి కలిసి నిర్మించిన ఈ సినిమాలో నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్స్ గా నటించారు. ప్రస్తుతం తమిళంలో అసురన్ సినిమా చేస్తున్న ధనుష్ తన తర్వాత సినిమా ఇస్మార్ట్ శంకర్ రీమేక్ చేస్తాడని అంటున్నారు. రీసెంట్ గా రిలీజైన అసురన్ ఫస్ట్ లుక్ లో ధనుష్ మేకోవర్ చూసి తమిళ ఫ్యాన్స్ సర్ ప్రైజ్ అయ్యారు.        Related Post

సినిమా స‌మీక్ష