బాహుబలి 3 ఉంటుందా..?

August 24, 2019


img

ఈ నెల 30న రిలీజ్ కాబోతున్న సాహో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రభాస్ నేషనల్ వైడ్ గా బీభత్సమైన ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఇక ఈ క్రమంలో రాజమౌళి ఆలోచనలో బాహుబలి 3 కూడా తెరకెక్కించే అవకాశం ఉందని అంటున్నాడు. బాహుబలి సృష్టించిన సంచలనాలు మనకందరికి తెలిసిందే. బాహుబలి రెండు భాగాల్లో 60 శాతం కథే పూర్తి చేశామని.. రాజమౌళి ఆలోచనల్లో సీక్వల్ కూడా ఉందని టాప్ సీక్రెట్ బయట పెట్టాడు ప్రభాస్.

అయితే మళ్లీ బాహుబలి తెరకెక్కిస్తాడా లేదా అన్న విషయం గురించి మాత్రం తనకు తెలియదని అన్నాడు ప్రభాస్. ఇక సాహో సినిమా విషయానికొస్తే సుజిత్ డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను యువి క్రియేషన్స్ వారు నిర్మించారు. శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా రిలీజ్ కు ముందు సూపర్ బజ్ ఏర్పరచుకుంది. కొన్నిచోట్ల సాహో బాహుబలిని మించి ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం విశేషం.   Related Post

సినిమా స‌మీక్ష