మాస్ రాజా అదిరిపోయే లుక్

August 24, 2019


img

మాస్ మహరాజ్ రవితేజ ప్రస్తుతం వి.ఐ ఆనంద్ డైరక్షన్ లో డిస్కో రాజా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాడని తెలుస్తుంది. ఇక లేటెస్ట్ గా రవితేజకు సంబందించిన ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ వ్యక్తితో సెల్ఫీ తీసుకుంటూ ఉన్న రవితేజ చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు. ఈ మేకోవర్ డిస్కో రాజా సినిమా కోసమే అంటున్నారు.   

రవితేజను ఇలా చూసిన మాస్ రాజా ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. డిస్కో రాజా సినిమాలో ఆరెక్స్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తుంది. 25 ఏళ్ల కుర్రాడిగా ఉన్న రవితేజ లుక్ చూసి ఆడియెన్స్ అవాక్కవుతున్నారు. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న డిస్కో రాజా ఈ ఇయర్ ఎండింగ్ కల్లా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. మొన్నటివరకు ఢిల్లి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా స్విట్జర్లాండ్ వెళ్లబోతున్నట్టు తెలుస్తుంది.   Related Post

సినిమా స‌మీక్ష