చనిపోయినా గుర్తుండిపోయే సినిమాలు చేస్తే చాలు

August 24, 2019


img

నేను థ్రిల్లర్ స్టార్, బడ్జెట్ స్టార్ కాదు.. నన్నొక నటుడిగా గుర్తుపెట్టుకుంటే చాలు అంటున్నాడు అడివి శేష్. తాను చనిపోయినా సరే నా సినిమా గుర్తుండిపోవాలంటూ ఎమోషనల్ స్పీష్ ఇచ్చారు. అడివి శేష్ నటించిన ఎవరు సినిమా రీసెట్ గా రిలీజై సూపర్ సక్సెస్ అందుకుంది. ఈ సదర్భంగా విజయోత్సవ సభలో మాట్లాడిన అడివి శేష్ కాలిఫోర్నియా నుండి వచ్చినా కృష్ణా నగర్ కష్టాలు అనుభవించానని అన్నారు.         

తమకి పెద్దగా ఆస్తులేమి లేవని.. కిస్ ఫెయిల్యూర్ తనకు ఎన్నో పాఠాలు నేర్పించిందని.. 2 కోట్లు అప్పు తెచ్చి మరి ఆ సినిమా తీస్తే పూర్తిగా నష్టపోవాల్సి వచ్చిందని.. చేతులో పదిరూపాయలు కూడా లేవు అప్పుచ్చిన వాళ్లు డబ్బు కోసం పోలీసులతో ఫోన్లు చేయించేవారు.. ఒక సందర్భంలో ఢిల్లో పోలీసుల మధ్య నిలబడాల్సి వచ్చింది. ఆ సమయంలో కూడా మనసుకి నచ్చిందే చేయాలని నిర్ణయించుకున్నా.. ఆ టైంలోనే పివిపి గారు క్షణం ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఎవరుతో మరో హిట్ అందించారు. మరో ఆరుగురు నిర్మాతలు నీపై నమ్మకం ఉంది ఏవైనా కథలు ఉంటే చెప్పు అంటున్నారు. ఈ మాట కోసమే ఇదంతా చేశా అంటూ ఎమోషనల్ అయ్యాడు అడివి శేష్. తను పడాల్సిన కష్టం పడితే ఆ కష్టానికి రావాల్సిన ప్రతిఫలం ఎప్పటికైనా వస్తుందని మరోసారి ప్రూవ్ చేశాడు అడివి శేష్. ఎవరు హిట్ జోష్ లో ఉన్న అడివి శేష్ ప్రస్తుతం మేజర్, గూఢచారి 2 సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి.        



Related Post

సినిమా స‌మీక్ష