షూటింగ్ కు ఆటోలో వెళ్లిన టాప్ హీరోయిన్

August 24, 2019


img

బాలీవుడ్ లో మంచి ఫాంలో ఉన్న కియరా అద్వాని ఈమధ్యనే కబీర్ సింగ్ తో మరో సూపర్ హిట్ అందుకుంది. తెలుగులో కూడా భరత్ అనే నేనుతో ప్రేక్షకులకు దగ్గరవగా వినయ విధేయ రామతో క్రేజ్ తెచ్చుకుంది. టాలీవుడ్ టూ బాలీవుడ్ చెక్కర్లు వేస్తున్న కియరా అద్వాని ముంబై వీధుల్లో ఆటోలో వెళ్తూ కనిపించింది. కొరియోగ్రాఫర్ షబినా ఖాన్ తో కలిసి ఆటోలో ఆమె షూటింగ్ కు వెళ్లింది.   

కియరా అద్వాని ఆటోలో వెళ్లిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంత పెద్ద స్టార్ హీరోయిన్ అయ్యుండి ఆటోలో వెళ్లడం చూసి ఫ్యాన్స్ ఆమె సింప్లిసిటీకి ఫిదా అవుతున్నారు. బాలీవుడ్ లో ప్రస్తుతం కియరా గుడ్ న్యూస్, లక్ష్మీ బాంబ్, పేర్షా, మర్ జావా సినిమాల్లో నటిస్తున్నారు.  తెలుగులో రెండు సినిమాలు డిస్కషన్స్ లో ఉన్నాయని తెలుస్తుంది. కోలీవుడ్ లో కియరాకు అవకాశాలు వస్తున్నట్టు తెలుస్తుంది.     


Related Post

సినిమా స‌మీక్ష